కీర్తనలు త్యాగరాజు ప్రారబ్ధ మిట్టుండగ నొరుల నన బనిలేదు రామ
స్వరావళి - ఝంప
పల్లవి:
ప్రారబ్ధ మిట్టుండగ నొరుల ననఁ బనిలేదు రామ! నా ॥ప్రారబ్ధ॥
అను పల్లవి:
వరద! బాల! గుణశీల! జనపాల! శూల
ధరవినుత! కాలాతీత! కృపాల వాల! నా ॥ప్రారబ్ధ॥
చరణము(లు):
ఉపకారి నేనైతే నపకారు లయ్యెదరు
కృపజూచిన మిగుల నెపము లెంచెదరయా
చపల చిత్తులు భక్తవేషులై నను జూచి
శత్రువులయ్యెదరు శ్రీ త్యాగరాజాప్త! నా ॥ప్రారబ్ధ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - praarabdha miTTuMDaga norula nana banileedu raama ( telugu andhra )