కీర్తనలు త్యాగరాజు ఫణిపతిశాయి! మాం పాతు పాలితాబ్ధిప!
ఝంకారధ్వని - ఆది
పల్లవి:
ఫణిపతిశాయి! మాం పాతు పాలితాబ్ధిప! హే ॥ఫణి॥
అను పల్లవి:
మణి మయ మకుట విరాజ - మాన మన్మథకోటి సమాన! ॥ఫణి॥
చరణము(లు):
గజవరగమన! కమనీయానన!
సుజనగణావన! సుందరవదన!
గజముఖవినుత! కరుణాకర! నీ
రజనయన! త్యాగరాజ వినుత! హే ॥ఫణి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - phaNipatishaayi! maaM paatu paalitaabdhipa! ( telugu andhra )