కీర్తనలు త్యాగరాజు బంటురీతిఁ గొలు వీయవయ్య రామ
హంసనాదం - దేశాది
పల్లవి:
బంటురీతిఁ గొలు వీయవయ్య రామ ॥బం॥
అను పల్లవి:
తుంటవింటివాని మొదలైన మదా
దులఁ బట్టి నేలఁ గూలఁజేయు నిజ ॥బం॥
చరణము(లు):
రోమాంచమనే ఘనకంచుకము
రామభక్తుడనే ముద్రబిళ్లయు
రామనామ మనే వరఖడ్గము వి
రాజిల్లనయ్య త్యాగరాజునికే ॥బం॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - baMTuriiti.r golu viiyavayya raama ( telugu andhra )