కీర్తనలు త్యాగరాజు బడలిక దీర పవ్వళించవే
రీతిగౌళ - ఆది
పల్లవి:
బడలిక దీర పవ్వళించవే ॥బడలిక॥
అను పల్లవి:
సడలని దురితములను తెగకోసి
సార్వభౌమ సాకేతరామ ॥బడలిక॥
చరణము(లు):
పంకజాసనుని పరితాపము కని
పంకజాప్తకుల పతివై వెలసి
పంకజాక్షితో వనమున కేగి
జింకను వధియించిన ॥బడలిక॥
మంకురావణుని మదము నణచి ని
శ్శంకుఁడగు విభీషణునికి బంగారు
లంక నొసగి సురుల బ్రోచిన నిష్క
ళంక త్యాగరాజనుత రామ ॥బడలిక॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - baDalika diira pavvaLiMchavee ( telugu andhra )