కీర్తనలు త్యాగరాజు బలము కులము ఏల రామ భక్తి కారణము
సావేరి - రూపకం
పల్లవి:
బలము కులము ఏల రామ భక్తి కారణము
వెలయు సకల సిద్ధులేల వెంట వచ్చుగాని మేను ॥బలము॥
చరణము(లు):
నీట కాకిమీను మునుగ నిరత ముదయస్నానమా
తేటకనులు కొంగగూర్ప దేవతల ధ్యానమా ॥బలము॥
పత్రములను మేయు మేక బలమైన యుపాసమా
చిత్రపక్షులెగయ సూర్య చంద్రులకు సామ్యమా ॥బలము॥
గుహల వేషకోటులుండ గుణము కల్గు మౌనులా
గహనమునను కోతులుండ ఘనమౌ వనవాసమా ॥బలము॥
జంగములు బలుకకున్న సంగతిగా మౌనులా
అంగము ముయ్యని బాలులు యపుడు దిగంబరురా ॥బలము॥
వలచు త్యాగరాజు వరదు వర భక్తులు సేయు భక్తి
చెలగు సకల జనులకెల్ల చెల్లిన కాసౌనుగా ॥బలము॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - balamu kulamu eela raama bhakti kaaraNamu ( telugu andhra )