కీర్తనలు త్యాగరాజు బ్రోవ భావమా రఘురామ
బహుదారి - ఆది
పల్లవి:
బ్రోవ భావమా రఘురామ
భువనమెల్ల నీవై నన్నొకని ॥బ్రో॥
అను పల్లవి:
శ్రీవాసుదేవ అండకోట్ల కు
క్షిని ఉంచు కోలేదా నన్ను ॥బ్రో॥
చరణము(లు):
కలశాంబుధిలో దయతో నమ
రులకై యదిగాక గోపి
కలకై కొండలెత్తలేదా
కరుణాకర త్యాగరాజుని ॥బ్రో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - broova bhaavamaa raghuraama ( telugu andhra )