కీర్తనలు త్యాగరాజు భక్తుని చారిత్రము వినవే మనసా
బేగడ - ఆది
పల్లవి:
భక్తుని చారిత్రము వినవే మనసా సీతారామ ॥భక్తుని॥
అను పల్లవి:
ఆసక్తిలేక తాఁ గోరు జీవ
న్ముక్తుఁడై యానందము నొందు ॥భక్తుని॥
చరణము(లు):
జప తపములు తా జేసితి ననరాదు అదిగాక మఱి
కపటాత్ముఁడు మనమై బల్క రాదు
ఉపమ తనకు లేక యుండవలెనని
యూరయూర తిరుగగ రాదు
చపల చిత్తుఁడై యాలు సుతులపై
సాంకు భ్రమ కారాదను హరి ॥భక్తుని॥
భవ విభవము నిజమని యెంచగరాదు అదిగాక మఱి
శివ మాధవ భేదము జేయగ రాదు
భువన మందు దానే యోగ్యుఁడనని
బొంకి పొట్ట సాకగ రాదు
పవనాత్మజ ధృతమౌ సీతాపతి
పాదములను యేమర రాదను హరి ॥భక్తుని॥
రాజస తామస గుణములుగా రాదు అది గాకేను అ
వ్యాజమునను రాలేదన గారాదు
రాజయోగ మార్గము నీ చిత్తము
రాజూచుట విడవగ రాదు
రాజ శిఖామణి యైన త్యాగ
రాజ సఖుని మరవ రాదనే హరి ॥భక్తుని॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - bhaktuni chaaritramu vinavee manasaa ( telugu andhra )