కీర్తనలు త్యాగరాజు భజన సేయరాదా? రామ
అఠాణ - రూపకం
పల్లవి:
భజన సేయరాదా? రామ ॥భజన॥
అను పల్లవి:
అజ రుద్రాదులకు సతత మాత్మ మంత్రమైన రామ ॥భజన॥
చరణము(లు):
కరకు బంగారు వల్వ కటి నెంతో మెరయగ
చిరు నవ్వులు గల మొగమును చింతించి చింతించి ॥భజన॥
అరుణాధరమున సురుచిర దంతావళిని
మెరయు కపోల యుగమును నిరతమునను దలచిదలచి ॥భజన॥
బాగుగ మానస భవ సాగరమునను తరింప
త్యాగరాజు మనవిని విని తారకమగు రామనామ ॥భజన॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - bhajana seeyaraadaa? raama ( telugu andhra )