కీర్తనలు త్యాగరాజు భజన సేయవే మనసా పరమ భక్తితో
కల్యాణి - రూపకం
పల్లవి:
భజన సేయవే మనసా పరమ భక్తితో ॥భజన॥
అను పల్లవి:
అజరుద్రాదులకు భూసు రాదుల కరుదైన రామ ॥భజన॥
చరణము(లు):
నాద ప్రణవ సప్తస్వర వేద వర్ణ శాస్త్ర పురా
ణాది చతుష్షష్ఠి కళల భేదము గలిగె
మోదకర శరీర మెత్తి ముక్తి మార్గమును దెలియక
వాద తర్కమేల శ్రీమ దాది త్యాగరాజనుతుని ॥భజన॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - bhajana seeyavee manasaa parama bhaktitoo ( telugu andhra )