కీర్తనలు త్యాగరాజు భజరామం సతతం మానస
హుసేని - ఆది (దివ్యనామము)
భజరామం సతతం మానస ॥భ॥
అమిత శుభాకరం పాప - తిమిర విభాకరం ॥భ॥
శతముఖనుతగీతం సకలా - శ్రితపారిజాతం ॥భ॥
పాలితలోకగణం పరమ క - పాలి వినుత సుగుణం ॥భ॥
సరోజ వరనాభం యమపు - రారాతి లాభం ॥భ॥
వరానందకందం నత - సురాది మునిబృందం ॥భ॥
కమనీయశరీరం ధీరం - మమ జీవాధారం ॥భ॥
కరధృతశరచాపం రామం - భరితగుణకలాపం ॥భ॥
భవ జలనిధి పోతం సారస - భవముఖ నిజతాతం ॥భ॥
వాతాత్మజసులభంవర - సీతావల్లభం ॥భ॥
రాజరవినేత్రం త్యాగ - రాజవరమిత్రం ॥భ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - bhajaraamaM satataM maanasa ( telugu andhra )