కీర్తనలు త్యాగరాజు భజరే భజ, మానస రామం
కన్నడ - చాపు
పల్లవి:
భజరే భజ, మానస! రామం ॥భజరే॥
అను పల్లవి:
అజముఖ శుక వినుతం శుభ చరితం ॥భజరే॥
చరణము(లు):
నిర్మితలోకం నిర్జిత శోకం
పాలిత మునిజన మధునా నృప పాకం ॥భజరే॥
శంకర మిత్రం శ్యామల గాత్రం
కింకర జన గణతాపత్రయ తమోమిత్రం ॥భజరే॥
భూసమ శాంతం భూజా కాంతం
వార మభిలదం త్యాగరాజ హృద్భాంతం ॥భజరే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - bhajaree bhaja, maanasa raamaM ( telugu andhra )