కీర్తనలు త్యాగరాజు భువిని దాసుఁడనే పేరాసచే
శ్రీరంజని - దేశాది
పల్లవి:
భువిని దాసుఁడనే పేరాసచే
బొంకులాడితినా బుధమనోహర ॥భు॥
అను పల్లవి:
అవివేక మానవులఁ గోరికోరి
అడ్డద్రోవ త్రొక్కితినా బ్రోవవే ॥భు॥
చరణము(లు):
చాల సౌఖ్యమో కష్టమో నేను
జాలిజెందితినా సరివారిలో
పాలముంచిన నీటముంచిన
పదములేగతి త్యాగరాజనుత ॥భు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - bhuvini daasu.rDanee peeraasachee ( telugu andhra )