కీర్తనలు త్యాగరాజు మనవాలకించరాదటే
నళినకాంతి - దేశాది
పల్లవి:
మనవాలకించరాదటే
మర్మమెల్లఁ దెల్పెదనే మనసా మ..
అను పల్లవి:
ఘనుఁడైన రామచంద్రుని
కరుణాంతరంగముఁ దెలిసిన నా మ..
చరణము(లు):
కర్మకాండమతాకృష్టులై భవ
గహనచారులై గాసిఁ జెందగ
కని మానవావతారుఁడై
కనిపించినాఁడే నడత త్యాగరాజు మ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manavaalakiMcharaadaTee ( telugu andhra )