కీర్తనలు త్యాగరాజు మనవిని వినుమా, మరవ సమయమా?
జయనారాయణి - ఆది
పల్లవి:
మనవిని వినుమా, మఱవ సమయమా? ॥మనవిని॥
అను పల్లవి:
కనుగొనగోరి దుష్కల్పన మానితి
కనికరమున నిను బాడుచున్న నా ॥మనవిని॥
చరణము(లు):
పరులకు హితమగు భావన గాని
చెరచు మార్గముల జింతింపలేను
పరమ దయాకర! భక్తమనోహర!
ధరాధిప కరార్చిత! త్యాగరాజ ॥మనవిని॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manavini vinumaa, marava samayamaa? ( telugu andhra )