కీర్తనలు త్యాగరాజు మనసా! శ్రీరాముని దయలేక మాయమైన విధమేమి
మారరంజని - ఆది
పల్లవి:
మనసా! శ్రీరాముని దయలేక మాయమైన విధమేమి? ॥మనసా॥
అను పల్లవి:
ఘన దురితమ్ముల గోట గట్టి నా కార్యముల చెరచితివో? ॥మనసా॥
చరణము(లు):
పర తారల పర ధనముల కాస
బడి చెడి తిరిగితివో లేక
పర జీవాత్ముల హింసించితివో
వర త్యాగరాజ నుతుని మరచితివో ॥మనసా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manasaa! shriiraamuni dayaleeka maayamaina vidhameemi ( telugu andhra )