కీర్తనలు త్యాగరాజు మనసు విషయ నట విటుల కొసంగిన
నాటకురంజి - ఆది
పల్లవి:
మనసు విషయ నట విటుల కొసంగిన
మా రాముని కృప గలుగునో? మనసా! ॥మనసు॥
అను పల్లవి:
తన తలు పొకరింటికిఁ దీసిపెట్టి
తాఁ గుక్కలఁ దోలురీతి గాదో! ॥మనసు॥
చరణము(లు):
తవిటికి రంకాడఁబోయి కూటి
తవిల కోతి గొంపోయినటు గాదో? ॥మనసు॥
చెవిటికి నుపదేశించినటు గాదో?
శ్రీ త్యాగరాజ నుతుని దలచక ॥మనసు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manasu viShaya naTa viTula kosaMgina ( telugu andhra )