కీర్తనలు త్యాగరాజు మనసునిల్ప శక్తిలేకపోతే
ఆభోగి - ఆది
పల్లవి:
మనసునిల్ప శక్తిలేకపోతే
మధురఘంటవిరుల పూజేమి జేయును? మ..
అను పల్లవి:
ఘనదుర్మదుఁడై తా మునిగితే
కావేరి మందాకిని యెటు బ్రోచును? మ..
చరణము(లు):
సోమిదమ్మ సొగసుగాండ్రఁ గోరితే
సోమయాజి స్వర్గార్హుఁడౌనో?
కామక్రోధుఁడు తపంబొనర్చితే
గాచి రక్షించునో? త్యాగరాజనుత! మ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manasunilpa shaktileekapootee ( telugu andhra )