కీర్తనలు త్యాగరాజు మనసులోని మర్మమును దెలుసుకో
హిందోళము - ఆది
పల్లవి:
మనసులోని మర్మమును దెలుసుకో
మానరక్షక మరకతాంగ నా ॥మ॥
అను పల్లవి:
ఇనకులాప్త నీవేగాని వేఱెవరులేరు ఆనందహృదయ ॥మ॥
చరణము(లు):
మునుపు ప్రేమగల దొరవై సదా
చనువు నేలినది గొప్పకాదయా
కనికరమ్ముతో నీవేళ నా
కరముఁబట్టు త్యాగరాజ వినుత ॥మ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - manasulooni marmamunu delusukoo ( telugu andhra )