కీర్తనలు త్యాగరాజు మరియాద గాదయ్యా మనుపవదేమయ్య
భైరవి - దేశాది
పల్లవి:
మరియాద గాదయ్యా మనుపవదేమయ్య మ..
అను పల్లవి:
సరివారిలో నన్ను చౌకచేయుటెల్ల శ్రీ
హరి హరి నీవంటి కరుణానిధికి మ..
చరణము(లు):
తనవారలన్యులనే తారతమ్యము మును
ఘనుఁడైన దాశరథికే గలదది కీర్తిగదా
నినుఁ బాయనేరని ననుఁ బ్రోవకుండేది
ధనదసఖుఁడగు త్యాగరాజపూజిత మ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - mariyaada gaadayyaa manupavadeemayya ( telugu andhra )