కీర్తనలు త్యాగరాజు మరియాద గాదురా
శంకరాభరణం - ఆది
పల్లవి:
మరియాద గాదురా ॥మరియాద॥
అను పల్లవి:
కరుణాకర! వారిని వీరిని
సరిజేసి చూచు చుండునది ॥మరియాద॥
చరణము(లు):
రాగము తాళము రక్తి భక్తి జ్ఞాన
యోగము మఱి యనురాగము లేని
భాగవతు లుదర శయనులే గాని
త్యాగరాజార్చిత తారక చరిత! ॥మరియాద॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - mariyaada gaaduraa ( telugu andhra )