కీర్తనలు త్యాగరాజు మఱి మఱి నిన్నే మొఱలిడ నీ
కాంభోజి - ఆది
పల్లవి:
మఱి మఱి నిన్నే మొఱలిడ నీ
మనసున దయరాదు మ..
అను పల్లవి:
కరిమొఱవిని సరగున చనఁ నీకు
గారణమేమి సర్వాంతర్యామి మ..
చరణము(లు):
కరుణతో ధ్రువుని కెదుట నిల్చిన
కథ విన్నానయ్యా
సురరిపుతనయునికై నరమృగమౌ
సూచనలేమయ్యా
మఱచియున్న వనచరునిఁ బ్రోచిన
మహిమఁ దెలుపవయ్యా
ధరను వెలయు త్యాగరాజ సన్నుత
తరముగాదిక నే విననయ్యా మ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maRi maRi ninnee moRaliDa nii ( telugu andhra )