కీర్తనలు త్యాగరాజు మా పాల వెలసి యిక
అసావేరి - ఆది
పల్లవి:
మా పాల వెలసి యిక
మముఁ బ్రోవఁగరాదా శ్రీరామచంద్ర మా..
అను పల్లవి:
నీ పాదముల భక్తి నిండారగ నిచ్చి
కాపాడుశక్తి నీ కరమున నుండఁగ మా..
చరణము(లు):
పాపసంహార నా పరితాపములను దునుమ
నేపాటిరా కరుణాపయోనిధివైన శ్రీపతీ విధృత
చాపబాణ యీ పాపమతి నరులాపదలను నే
నేపని జూతును ఆపద్బాంధవ కాపాడ నీకీ పరాకేల మా..
దీనరక్షక భక్తాధీన సాకేతనగరీశ నామది పద
రిన సుజన మానాభిమానపాలన సమానరహిత రో
సాన నీదు దాసానుదాసుఁడను దానవాంతక ము
దాన నారద సుగానలోల దరిగాన సంతతము మా..
నాగాధిపవినుత నాగారిరథ నినువినా గతి నెఱుఁగ
నాగరాజ హృత్సాగరాబ్జ భవసాగరాంతకా సు
రాఘహర కనకాగధీర సురనాగగమన శర
ణాగతాప్త శ్రీ త్యాగరాజనుత మా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maa paala velasi yika ( telugu andhra )