కీర్తనలు త్యాగరాజు మా రామచంద్రునికి జయమంగళం
కేదారగౌళ - ఆది
పల్లవి:
మా రామచంద్రునికి జయమంగళం ॥మా॥
అను పల్లవి:
ఘోర భవ వరనిధి తారకునికి మంగళం ॥మా॥
చరణము(లు):
మారుని గన్న రాజ కుమారునికి మంగళం
మారులేని హరికి ముమ్మారు జయమంగళం ॥మా॥
బాహులే యాప్తునికి సుబాహు వైరికి మంగళం
బాహుజా శూరు డాజాను బాహునికి మంగళం ॥మా॥
బృందావన స్థిరమౌని బృందావనునికి మంగళం
బృందాలోలునికి పాలిత బృందారకునికి మంగళం ॥మా॥
రాజవేషునికి రాజ రాజార్చితునికి మంగళం
రాజధరుఁడగు త్యాగ రాజ నుతునికి మంగళం ॥మా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maa raamachaMdruniki jayamaMgaLaM ( telugu andhra )