కీర్తనలు త్యాగరాజు మాకులమున కిహ పర మొసగిన నీకు మంగళం శుభమంగళం
సురటి - చాపు
మాకులమున కిహ పర మొసగిన
నీకు మంగళం శుభమంగళం ॥మా॥
మౌనుల బ్రోచిన మదజనక
నీకు మంగళం శుభమంగళం ॥మా॥
మదగజగమన మానితసద్గుణ
నీకు మంగళం శుభమంగళం ॥మా॥
మదమోహరహిత మంజుళరూపధర
నీకు మంగళం శుభమంగళం ॥మా॥
మనసిజవైరి మానససదన
నీకు మంగళం శుభమంగళం ॥మా॥
మనవిని విని మమ్మేలుకొన్న
నీకు మంగళం శుభమంగళం ॥మా॥
మా మనసున నెలకొన్న రామ
నీకు మంగళం శుభమంగళం ॥మా॥
మా మనోహర పాలిత త్యాగరాజ
మంగళం శుభమంగళం ॥మా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maakulamuna kiha para mosagina niiku maMgaLaM shubhamaMgaLaM ( telugu andhra )