కీర్తనలు త్యాగరాజు మాకేలరా విచారము
రవిచంద్రిక - దేశాది
పల్లవి:
మాకేలరా విచారము
మరుఁ గన్న శ్రీరామచంద్ర ॥మ॥
అను పల్లవి:
సాకేత రాజకుమార
సద్భక్తమందార శ్రీకర ॥మ॥
చరణము(లు):
జతగూర్చి నాటకసూత్రమును
జగమెల్ల మెచ్చగఁ కరమున నిడి
గతితప్పకాడించేవు సుమ్మీ
నత త్యాగరాజ గిరీశవినుత ॥మ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maakeelaraa vichaaramu ( telugu andhra )