కీర్తనలు త్యాగరాజు మాటాడవేమి నాతో? మాధుర్య పూర్ణాధర
నీలాంబరి - దేశాది
పల్లవి:
మాటాడవేమి నాతో?
మాధుర్య పూర్ణాధర! ॥మాటాడ॥
అను పల్లవి:
సాటి దొరకని రామ
స్వామి! మది రంజిల్ల ॥మాటాడ॥
చరణము(లు):
ఎదురెదురు జూచి యెందు గానక నా
హృదయమున కెంతో హితవు లేక
సదయుఁడని నేనుండగ సముఖము దొరికిన నీ
రదవర్ణ శ్రీ త్యాగరాజార్చిత ముద్దుగ ॥మాటాడ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maaTaaDaveemi naatoo? maadhurya puurNaadhara ( telugu andhra )