కీర్తనలు త్యాగరాజు మామవ! రఘురామ, మరకత మణిశ్యామ
సారంగ - రూపకం
పల్లవి:
మామవ! రఘురామ! మరకత మణిశ్యామ! ॥మామవ॥
అను పల్లవి:
పామరజన భీమ! పాలిత సుత్రామ! ॥మామవ॥
చరణము(లు):
దురితంబులు బోదు ధునుమ మనసు రాదు ॥మామవ॥
కలశాంబుధి లోన కరుణ కరగి బోయెనా ॥మామవ॥
విను మఱి సమరము నా విధి శరము విరిగినా ॥మామవ॥
గల సత్యము సుగుణ కాననమున నిల్చెనా ॥మామవ॥
దివ్య నరాపఘ్న దేవత్వము బోయెనా ॥మామవ॥
రాజాధిప త్యాగ రాజ వినుత బాగ ॥మామవ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maamava! raghuraama, marakata maNishyaama ( telugu andhra )