కీర్తనలు త్యాగరాజు మాఱుబల్కకున్నా వేమిరా - మా మనోరమణ
శ్రీరంజని - ఆది
పల్లవి:
మాఱుబల్కకున్నా వేమిరా - మా మనోరమణ ॥మా॥
అను పల్లవి:
జార చోర భజన జేసితినా - సాకేతవదన ॥మా॥
చరణము(లు):
దూరభారమందు నా హృద - యారవిందమందు నెలకొన్న
దారి నెఱిఁగి సంతసిల్లినట్టి - త్యాగరాజనుత ॥మా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - maaRubalkakunnaa veemiraa - maa manooramaNa ( telugu andhra )