కీర్తనలు త్యాగరాజు ముందువెనుక ఇరుప్రక్కలతోడై
దర్బారు - ఆది
పల్లవి:
ముందువెనుక ఇరుప్రక్కలతోడై
మురఖరహర రారా ముం..
అను పల్లవి:
ఎందుఁగాన నీయందమువలె రఘు
నందన వేగమే రారా ముం..
చరణము(లు):
చండభాస్కర కులాబ్ధిచంద్ర కో
దండపాణియై రారా
అండఁగొలుచు సౌమిత్రి సహితుడై
అమిత పరాక్రమ రారా
ఓ గజరక్షక ఓ రాజకుమార
ఓంకారసదన రారా
భాగవతప్రియ బాగ బ్రోవవయ్య
త్యాగరాజనుత రారా ముం..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - muMduvenuka iruprakkalatooDai ( telugu andhra )