కీర్తనలు త్యాగరాజు ముమ్మూర్తులు గుమిగూడి పొగడే
అఠాణ - దేశాది
పల్లవి:
ముమ్మూర్తులు గుమిగూడి పొగడే
ముచ్చట వినుకోరె ము..
అను పల్లవి:
సమ్మతిగా రాజు కొడుకనఁగ విని
సంశయముదీరక శ్రీరాముని ము..
చరణము(లు):
రోసముతో రఘురాముని గుణముల
రూఢిగఁ దమగుణముల నటు వ్రాసి
త్రాసున నిడ సరినిల్వలేదని
త్యాగరాజనుతుఁ డెవఁడో యనుచును ము..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - mummuurtulu gumiguuDi pogaDee ( telugu andhra )