కీర్తనలు త్యాగరాజు మృదుభాషణా నతవిభీషణా
మారువధన్యాసి - దేశాది
పల్లవి:
మృదుభాషణా నతవిభీషణా మృ..
అను పల్లవి:
సుదురాస మాన్పగలేని నను
సుఖచిత్తుగా నెవరు సేతురే మృ..
చరణము(లు):
వరదా నవాంబుద సమీరణ
వరదానఘామర పాలక
దరహాస సద్గుణభూష పరాత్‌
పర త్యాగరాజ కరార్చిత మృ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - mR^idubhaashhaNaa natavibhiishhaNaa ( telugu andhra )