కీర్తనలు త్యాగరాజు మేలుకో దయానిధీ మేలుకో దాశరథీ
సౌరాష్ట్రము - రూపకము
పల్లవి:
మేలుకో దయానిధీ మేలుకో దాశరథీ ॥మే॥
అను పల్లవి:
మేలుకో దయానిధీ మిత్రోదయమౌ వేళ ॥మే॥
చరణము(లు):
నారదాదిమునులు సురలు వారిజభవుఁ డిందుకలా
ధారుఁడు నీ సన్నిధినే కోరి కొలువుగాచినారు ॥మే॥
వెన్నపాలు బంగారు గిన్నెల నేనుంచినాను
తిన్నగారగించి తేటకన్నులతో నన్నుఁజూడ ॥మే॥
రాజరాజాది దిగ్రాజులెల్ల వచ్చినారు
రాజనీతితెలియ త్యాగరాజ వినుత నన్నుఁ బ్రోవ ॥మే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - meelukoo dayaanidhii meelukoo daasharathii ( telugu andhra )