కీర్తనలు త్యాగరాజు మోహనరామ ముఖజిత సోమ ముద్దుగఁ బల్కుమా
మోహన - ఆది
పల్లవి:
మోహనరామ ముఖజిత సోమ ముద్దుగఁ బల్కుమా ॥మో॥
అను పల్లవి:
మోహనరామ మొదటి దైవమా
మోహము నీపై మొనసియున్నదిరా ॥మో॥
చరణము(లు):
ధర మనుజావతార మహిమ విని
సురకిన్నర కింపురుష విద్యాధర
సురపతి విధి విభాకర చంద్రాదులు
కరఁగుఁచుఁ బ్రేమతో
వర మృగ పక్షి వానర తనువులచే
గిరిని వెలయు సీతావర చిరకాలము
గుఱితప్పక మైమఱచి సేవించిరి
వర త్యాగరాజ వరదాఖిల జగన్‌ ॥మో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - moohanaraama mukhajita sooma mudduga.r balkumaa ( telugu andhra )