కీర్తనలు త్యాగరాజు రక్ష బెట్టరె దొరకు లక్ష బెట్టరె
భైరవి - ఆది
పల్లవి:
రక్ష బెట్టరె దొరకు లక్ష బెట్టరె ॥ర॥
అను పల్లవి:
వక్షస్థలమున వెలయు లక్ష్మీరమణునికి సాయ ॥ర॥
చరణము(లు):
సీతాకరమునుబట్టి చెలఁగిన దొరకు
వాతాత్మజునికి చెయి వశమైనదొరకు - పురు
హూతాదుల రక్షింప బాహుజుడైన దొరకు - సం
గీతాప్రియ త్యాగరాజ గేయుఁడైన దొరకైశ్వర్య ॥ర॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raxa beTTare doraku laxa beTTare ( telugu andhra )