కీర్తనలు త్యాగరాజు రఘునాయక! నీ పాదయుగ రాజీవముల నే విడజాల
హంసధ్వని - దేశాది
పల్లవి:
రఘునాయక! నీ పాదయుగ
రాజీవముల నే విడజాల శ్రీ ॥రఘు॥
అను పల్లవి:
అఘజాలములఁబారఁదోలి న
న్నాదరింప నీవే గతిగాద శ్రీ ॥రఘు॥
చరణము(లు):
భవ సాగరము దాట లేక నే
బలు గాసి బడి నీ మఱుఁగు జేరితిని
అవనిజాధిపా శ్రితరక్షక
ఆనందకర శ్రీ త్యాగరాజనుత ॥రఘు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raghunaayaka! nii paadayuga raajiivamula nee viDajaala ( telugu andhra )