కీర్తనలు త్యాగరాజు రఘుపతే! రామ! రాక్షస భీమ!
శహాన - రూపకం
పల్లవి:
రఘుపతే! రామ! రాక్షస భీమ! ॥రఘు॥
అను పల్లవి:
భృగు సుత మద హరణ ముని బృంద వందిత చరణ! ॥రఘు॥
చరణము(లు):
సరసీరుహ నయన సజ్జన హృదయ నికేతన
ధరణీధర ధరా! సీతా మనోహర
నిరవధిసుఖదా ప్రమేయ నిరుపమ నారద సుగేయ
కరధృతశరజాల నీలఘనవర్ణామరపాల ॥రఘు॥
తరుణారుణ నిభచరణ తపవంశ విభూషణ
వరుణాల యమద దమన వారణావన
కరుణాకర గిరీశ చాపఖండన! నిర్జిత తాప
పరిపూర్ణావతార! పరభామినీదూర ॥రఘు॥
హరిహయపంకజ భవనుత పురవైరిపురా
శరహిత నరవరవేష తారక నామధేయ
స్వరజిత ఘనరవపరేశ శతభాస్కర సంకాశ
పరిపాలిత త్యాగరాజ పాహి భక్త సమాజ ॥రఘు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raghupatee! raama! raaxasa bhiima! ( telugu andhra )