కీర్తనలు త్యాగరాజు రాగసుధారస పానముచేసి - రాజిల్లవె ఓ మనసా
ఆందోళిక - దేశాది
పల్లవి:
రాగసుధారస పానముచేసి - రాజిల్లవె ఓ మనసా ॥రా॥
అను పల్లవి:
యాగయోగత్యాగ - భోగఫల మొసంగే ॥రా॥
చరణము(లు):
సదాశివమయమగు - నాదోంకారస్వర
విదులు జీవన్ముక్తులని - త్యాగరాజు తెలియు ॥రా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raagasudhaarasa paanamucheesi - raajillave oo manasaa ( telugu andhra )