కీర్తనలు త్యాగరాజు రాజు వెడలెఁ జూతాము రారె కస్తూరి రంగ
దేశికతోడి - రూపక
పల్లవి:
రాజు వెడలెఁ జూతాము రారె కస్తూరి రంగ రా..
అను పల్లవి:
తేజి నెక్కి సామంతరాజు లూడిగము సేయ
తేజరిల్లు నవరత్నపు దివ్యభూషణము లిడి రంగ రా..
చరణము(లు):
కావేరీతీరమునను బావనమగు రంగపురిని
శ్రీవెలయు చిత్రవీథిలో వేడ్కగఁ రాగ
సేవను గని సురలు విరులచేఁ బ్రేమను పూజించఁగ
భావించి త్యాగరాజు బాడఁగ వైభోగరంగ రా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raaju veDale.r juutaamu raare kastuuri raMga ( telugu andhra )