కీర్తనలు త్యాగరాజు రానిది రాదు సురాసురులకైన
మణిరంగు - ఆది
పల్లవి:
రానిది రాదు సురాసురులకైన రా..
అను పల్లవి:
పోనిది పోదు భూసురులకైన రా..
చరణము(లు):
దేవేంద్రునికి సుదేహము పూర్వ
దేవుల కమృతమభావమెగాని
ఆ వనచరబాధ లామునులకే గాని
పావన! త్యాగరాజ భాగ్యమా! శ్రీరామ రా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raanidi raadu suraasurulakaina ( telugu andhra )