కీర్తనలు త్యాగరాజు రామ నన్ను బ్రోవ రావేమెకో? లోకాభి
హరికాంభోజి - రూపకం
పల్లవి:
రామ నన్ను బ్రోవ రావేమెకో? లోకాభి ॥రామ॥
అను పల్లవి:
చీమలో బ్రహ్మలో శివ కేశవాదులలో
ప్రేమమీర వెలుగుచుండు బిరుదు వహించిన సీతా ॥రామ॥
చరణము(లు):
మెప్పులకై కన్నతావు నప్పు బడక విఱ్ఱవీగి
తప్పు పనులు లేక యుండు త్యాగరాజ వినుత సీతా ॥రామ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raama nannu broova raaveemekoo? lookaabhi ( telugu andhra )