కీర్తనలు త్యాగరాజు రామ బాణత్రాణ శౌర్య
సావేరి - ఆది
పల్లవి:
రామ బాణత్రాణ శౌర్య
మేమని పొగడుదురా ఓ మనసా రా..
అను పల్లవి:
భామ కాసపడు రావణు మూల
బలముల నేలఁగూలఁ జేయు రా..
చరణము(లు):
తమ్ముఁడు బడలిన వేళ సురరిపు
తెమ్మని చక్కెర బంచీయఁగఁ గని
లెమ్మనుచును ఇంద్రారి బల్క సమ
యమ్మని లేవఁగా
సమ్మతితో నిలఁబడి కోదండపు
జ్యాఘోషము లశనులఁ జేసి తా
నెమ్మదిగల తోడును జూచెనురా
నిజమైన త్యాగరాజనుతుఁడగు రా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raama baaNatraaNa shaurya ( telugu andhra )