కీర్తనలు త్యాగరాజు రామ రామ నీవారము గామా రామ సీతా
ఆనంద భైరవి - ఆది
పల్లవి:
రామ రామ నీవారము గామా రామ సీతా రా..
అను పల్లవి:
రామ రామ సాధుజన ప్రేమ రారా రా..
చరణము(లు):
మెఱుగుఁ జేలము గట్టుకో మెల్ల రారా రామ
కఱకు బంగారు సొమ్ములు కదల రారా రా..
వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ
మఱుగుఁ జేసికొనే దట్టి మహిమ రారా రా..
మెండైన కోదండకాంతి మెఱయ రారా కనుల
పండువగ యుండు ఉద్దండ రారా రా..
చిఱునవ్వుగల మోముఁజూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు గావ రారా రా..
కందర్పసుందరానందకంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా రా..
ఆద్యంత రహిత వేదవేద్యా రారా భవ
వైద్య నీవాఁడనైతి వేగ రారా రా..
సుప్రసన్న సత్యరూప సుగుణ రారా రామ
అప్రమేయ త్యాగరాజునేలరారా రా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raama raama niivaaramu gaamaa raama siitaa ( telugu andhra )