కీర్తనలు త్యాగరాజు రామ రామ రామ లాలి శ్రీరామ
శహన - చాపు
పల్లవి:
రామ రామ రామ లాలి శ్రీరామ
రామ రామ లావణ్య లాలి ॥రా॥
చరణము(లు):
దొరకరాని నిధిరారా దొరకు
దొరవు నీవు తొట్లలో రారా ॥రా॥
వరమైనట్టి వాపట్టిరారా వర
సురులకు అరుదైన సుందర రారా ॥రా॥
తొలిఁజేసిన నోము ఫలమా రామ
ఇలను వెలయు ఇనకుల ధనమా ॥రా॥
కలకలమని రావు చెంత ఆ
కలి కొంటివో లేక కరుణాస్వాంత ॥రా॥
మదగజ మన నా స్వామి ఓ
సదయుఁడ నీ లోని జాలి దెల్పుమి ॥రా॥
సరిబాలు లాడ రమ్మనిరి ఆడి
వరద నీవు రావద్దు పొమ్మనిరి ॥రా॥
ఎవరు నిన్ను ఏమనిరి రాఘవ
నీ యెడ తప్పు కని రావద్దనిరి ॥రా॥
కనులుమూసి యాడినారు కర
మున కణఁగనినేత్రమని కసరెదరు ॥రా॥
కలువరేకులను బోలు కనులు
కలగనేల నన్నుగన్న దయాళో ॥రా॥
నుదుటను శ్రమజలమేల ఆ
కథయేమి దెలుపవే కరుణాలవాల ॥రా॥
చింతచే దాగుదు వేఱే మేని
కాంతిచే దాగుదు వేఱే మేని
కాంతిచేఁ దగిలిన కర్మమనేరే ॥రా॥
ముత్యాలసరుల చిక్కేమీ
ఓ సత్యసంధ పాదసరుల నొక్కేమి ॥రా॥
ముదమున నేపట్టు వేళనా
పదమున నేపట్టు వేళనా
పదమున వ్రాలెదరు పలుమాఱావేళ ॥రా॥
నిన్నేమని బిల్చుకొనిరి రామ
మన్ననతో నేమని యెంచుకొనిరి ॥రా॥
బాగ సాక్షి రమ్మనిరి వర
త్యాగరాజనుత దైవమాయనిరి ॥రా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raama raama raama laali shriiraama ( telugu andhra )