కీర్తనలు త్యాగరాజు రామ శ్రీరామ లాలీ ఊగుచు ఘన
శంకరాభరణము - ఆది
పల్లవి:
రామ శ్రీరామ లాలీ ఊగుచు ఘన
శ్యామ ననుబ్రోవు లాలీ ॥రా॥
చరణము(లు):
చాల పాలింతు లాలీ మీగడ వెన్న
పాలు తాగింతు లాలీ శయ్యపైని మల్లె
పూల బరతు లాలీ - వరమైన వి
డేల నొసగె లాలీ - ఓ వనమాలీ ॥రా॥
కాచి సేవింతు లాలీ శేషతల్పము
నూచి పాడుదు లాలీ ఏకాంతమున
దాచి పూజింతు లాలీ ఆవేళ నిన్ను
జూచుచుప్పొంగే లాలీ - ఓ వనమాలీ ॥రా॥
వేదవేద్యమా లాలీ - కన్నులఁ జూడ
వే దయానిధి లాలీ - నాదురమున నీ
పాదములుంచు లాలీ - శ్రీ త్యాగరాజ
మోదరూపమా లాలీ - ఓ వనమాలీ ॥రా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raama shriiraama laalii uuguchu ghana ( telugu andhra )