కీర్తనలు త్యాగరాజు రామకథాసుధారసపానమొక రాజ్యము చేసునే
మధ్యమావతి - దేశాది
పల్లవి:
రామకథాసుధారసపానమొక రాజ్యము చేసునే రా..
అను పల్లవి:
భామామణి జానకి సౌమిత్రి
భరతాదులతో భూమి వెలయు సీతా రా..
చరణము(లు):
ధర్మాద్యఖిలఫలితమే మనసా
ధైర్యానంద సౌఖ్య నికేతనమే
కర్మబంధ జ్వలనాబ్ధినామమే
కలిహరమే త్యాగరాజవినుతుఁడగు రా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raamakathaasudhaarasapaanamoka raajyamu cheesunee ( telugu andhra )