కీర్తనలు త్యాగరాజు రామభక్తి సామ్రాజ్య - మేమానవుల కబ్బెనో మనసా
శుద్ధబంగాళ - ఆది
పల్లవి:
రామభక్తి సామ్రాజ్య - మేమానవుల కబ్బెనో మనసా ॥రా॥
అను పల్లవి:
ఆ మానవుల సందర్శన - మత్యంత బ్రహ్మానందమే ॥రా॥
చరణము(లు):
ఈలాగని వివరింపలేను
చాల స్వానుభవవేద్యమే
లీలాసృష్టి జగత్త్రయ మనే
కోలాహల త్యాగరాజనుతుఁడగు ॥రా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raamabhakti saamraajya - meemaanavula kabbenoo manasaa ( telugu andhra )