కీర్తనలు త్యాగరాజు రామా నిన్నేనమ్మినాను - నిజముగ సీతా
హుసేని - ఆది
పల్లవి:
రామా నిన్నేనమ్మినాను - నిజముగ సీతా ॥రా॥
అను పల్లవి:
కామజనక కమనీయవదన
ననుఁగావవే కారుణ్యజలధే ॥రా॥
చరణము(లు):
సార సామాది వేదసార
సంతత బుధవిహార రాజితముక్తా
హార కనకకేయూరధర సుగుణ
పారావార సురారాధితపద ॥రా॥
ధీర సుజన హృత్పంజర - కీర నీ పదభక్తి మా
కీర మదన సుందరా - కార దనుజసంహార దుష్టజన
దూర రఘుకులోద్ధారోదార ॥రా॥
రాజరాజ వందిత భూజానాయక సురస
మాజ శ్రీకర త్యాగరాజ మానస సరోజ కుసుమ దిన
రాజ పంక్తిరథరాజ తనయ శ్రీ ॥రా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raamaa ninneenamminaanu - nijamuga siitaa ( telugu andhra )