కీర్తనలు త్యాగరాజు రామా నీపై తనకు ప్రేమబోదు సీతా
కేదార - ఆది
పల్లవి:
రామా నీపై తనకు ప్రేమబోదు సీతా ॥రా॥
అను పల్లవి:
తామరసనయన నీదేమో మాయగాని ॥రా॥
చరణము(లు):
మనసు నీపదములనే జేరఁ - గనులు నీ రూపమునె కోర
విను నీపేరులకే నోరూర - తనపై ఇది నీ కరుణేర ॥రా॥
జననీ జనకాప్తు లన్యులు - ధన కనక గురు వేల్పులు
దినము నీవేయని మాటలు - అనఘ ఇవి నా భూషణములు ॥రా॥
భోగానుభవములందు - బాగుగా బుద్ధి నీయందు
త్యాగరాజుని హృదయమందు - వాగీశానందమందు ॥రా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raamaa niipai tanaku preemaboodu siitaa ( telugu andhra )