కీర్తనలు త్యాగరాజు రాముని మఱవకవే ఓ మనసా
కేదారగౌళ - ఆది
పల్లవి:
రాముని మఱవకవే ఓ మనసా రా..
అను పల్లవి:
రాముని యాగముఁగాచిన పాప వి
రాముని సద్గుణధాముని సీతా రా..
చరణము(లు):
ధీరుని దైత్యవిదారుని లోకా
ధారుని వంశోద్ధారుని సీతా రా..
ధ్యేయుని మునిజనగేయుని ఘననిభ
కాయుని దేవరాయుని సీతా రా..
వాసవహృదయనివాసుని బహురవి
భాసుని శుభకరవేసుని సీతా రా..
గీతప్రియుని విధాతనుతుని కం
జాత బంధుకులజాతుని సీతా రా..
ఈ జగతిని అవ్యాజమున నాప్త స
మాజము నను బ్రోచు జగత్పతిని సీతా రా..
దానవహరు నీశానవినుతుని స
దా నరోత్తముల మానరక్షకుని రా..
శోభనదుని గిరిజాబాహుని దురి
తేభహరుని బహు ప్రభావుని సదా రా..
శీలిని సద్గుణశాలిని ఘనుని గ
పాలినుతుని వనమాలిని సీతా రా..
శ్రీగురుచరణములే గతి యనిన స
దా గతిజహితుని త్యాగరాజనుతుని రా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raamuni maRavakavee oo manasaa ( telugu andhra )