కీర్తనలు త్యాగరాజు లక్షణములు గల శ్రీరామునికి ప్రదక్షిణ మొనరింతము రారే
శుద్ధసావేరి - ఆది
పల్లవి:
లక్షణములు గల శ్రీరామునికి ప్ర
దక్షిణ మొనరింతము రారే ॥లక్షణములు॥
అను పల్లవి:
కుక్షిని బ్రహ్మాండము లున్నవట వి
చక్షణుఁడట దీక్షా గరుఁడట శుభ ॥లక్షణములు॥
చరణము(లు):
లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్ర త్యక్షం బౌనట
శిక్షఁ బడి సభను మెప్పించు భక్త రక్షకుఁ డౌనట
అక్షరస్తులయిన భజన పరులకే అంతరంగుఁ డౌనట
సాక్షియై వెలయు త్యాగరాజ
పక్షకుఁడౌనట ముప్పదిరెండు ॥లక్షణములు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - laxaNamulu gala shriiraamuniki pradaxiNa monariMtamu raaree ( telugu andhra )